ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవం

తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు ధృవీకరణ పత్రాన్ని గుత్తా సుఖేందర్ రెడ్డికి అందజేశారు.

ఇవాళ్టితో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్‌ ఉపసంహరణకు గడువు ముగిసింది. గుత్తా ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేసి ఉండటంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సుఖేందర్ రెడ్డి.. ఎమ్మెల్సీగా తనకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసేవకే తన ఎమ్మెల్సీ పదవిని వినియోగిస్తాన్నారు. వ్యవసాయ రంగానికి TRS ప్రభుత్వం చేసినంతగా ఏ ప్రభుత్వం చేయలేదన్నారు గుత్తా.

Latest Updates