జిమ్ లో ఎక్కువసేపు వ్యాయామం..యువకుడు మృతి

హైదరాబాద్‌:  SR నగర్‌ లోని గోల్డెన్‌ జిమ్‌ లో సోమవారం ఉదయం వ్యక్తి కుప్పకూలిపోయాడు.  అధిక వ్యాయామం చేయడంతో ఛాతినొప్పితో ఆదిత్య(30) అనే యువకుడు కుప్పకూలిపోయాడు. జిమ్‌ నిర్వాహకులు ఆదిత్యకు టాబ్లెట్‌ ఇచ్చారు. టాబ్లెట్‌ వేసుకున్నాక అతని పరిస్థితి మరింత విషమించింది. దీంతో వెంటనే హస్పిటల్ కి తరలించారు. చికిత్సపొందుతూ ఆదిత్య ప్రాణాలు కోల్పోయాడు.

పంజాబ్ కు చెందిన ఆదిత్య డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగి. కొంతకాలంగా గోల్డెన్ జిమ్ కు వచ్చి వ్యాయామం చేస్తున్నాడు. సోమవారం ఉదయం జిమ్ లో చాలా సేపు ఎక్సర్ సైజ్ చేసిన ఆదిత్య.. ఒక్కసారిగా నీరసించి ఊపిరాడక స్పృహ తప్పి కింద పడిపోయాడని తెలిపాడు జిమ్ నిర్వాహకుడు. గోల్డెన్ జిమ్ పై SR నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఆదిత్య బంధువులు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆదిత్య డెడ్ బాడీని పోస్ట్ మార్టమ్ కోసం గాంధీ హస్పిటల్ కు తరలించారు.

 

Latest Updates