H1B తో జాబ్ మారితే అంతే

వీసాల మీద అమెరికా రోజుకో షాక్ ఇస్తోంది.వీసా జారీల్లో కఠినంగా ఉంటున్న ట్రంప్ సర్కార్ .. మరో అస్త్రాన్ని సంధించింది. హెచ్ 1బీ వీసా మీద ఓ కంపెనీల పనిచేస్తున్న ఉద్యోగులు మరో కంపెనీకి మారకుండా మోకాలడ్డుతోంది. కొత్త కంపెనీలు ఉద్యోగికి సంబంధించి వీసా ట్రాన్స్ ఫర్ దరఖాస్తులను పెట్టు కుంటున్నా అమెరికా సిటిజెన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్ సీఐఎస్ ) తిరస్కరిస్తోంది. అదేమీ ‘స్పెషాలిటీ ఆక్యు పేషన్ ’ కాదన్న సాకు చూపుతోంది. అంతేకాదు వీసా తిరస్కరించి ‘ఔట్ ఆఫ్ స్టేటస్ ’ స్టాం పేసి మూడేళ్ల నుంచి పదేళ్ల దాకా మళ్లీ అమెరికాలో కాలుపెట్టకుండా నిషేధం విధిస్తోంది. భారత్ కు చెందిన ఉషా సాగర్ వాలా అనే మహిళకు అదే పరిస్థితి ఎదురైంది. దీనిపై ఆమె అమెరికా ఫెడరల్ కోర్టుకు వెళ్లినా మొండిచెయ్యే ఎదురైంది. జోక్యం చేసుకోలేమంటూ ఏప్రిల్ 16న కేసు కొట్టేసింది.

వీసాల జారీలో కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా.. కొత్తగా మరో అస్త్రాన్ని తీసింది. హెచ్ 1బీ వీసా మీద ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నోళ్లు .. వేరే కంపెనీకి మారకుండా చేస్తోంది. ఆ కొత్త ఉద్యోగం పాతదానిలాగే ఉన్నా నో అంటోంది అమెరికా సిటిజెన్​షిప్ అండ్ ఇమిగ్రేషన్​ సర్వీసె స్ (యూఎస్ సీ ఐఎస్ ). ఆ ఉద్యోగి కి సంబంధిం చి వీసా ట్రాన్స్​ఫర్ కు కంపెనీలు దరఖాస్తు చేసుకుంటున్నా తిరస్కరిస్తోంది. దానికి చూపుతున్న కారణం.. అదేమీ ‘స్పెషాలిటీ ఆక్యుపే షన్​ (ప్రత్యేకనైపుణ్యాలు)’ కాదని చెబుతోంది. అంతేకాదు.. అలా జాబ్ మారాలనుకు నేవారి వీసాలపై ఔట్ ఆఫ్ స్టేటస్ స్టాంపేసి మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు అమెరికాలోకి రాకుం డా నిషేధం విధిస్తోంది. ఉషా సాగర్ వాలా అనే భారత మహిళకు అదే ఎదురైంది. ఆమె అమెరి కాలో 2012 నుంచి హెచ్ 1బీ వీసా మీద నివసిస్తోంది. 2018లో వేరే కంపెనీలోకి జాబ్ మారింది. అయితే, కంపెనీ పెట్టిన వీసా ట్రాన్స్​ఫర్ దరఖాస్తును అదేమీ స్పెషా లిటీ ఆక్యుపే షన్​ కాదంటూ యూఎస్ సీఐఎస్ తిరస్కరించిం ది. అంతేకాదు.. ఆమె వీసాను ఔట్ ఆఫ్ స్టేటస్ గా పేర్కొం ది. దీనిపై ఆమె అమెరికా ఫెడరల్ కోర్టుకెళ్లింది. హెచ్ 1బీ స్టేటస్ ను యథావిధిగా ఉంచాలని కోరింది. అయితే, ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని ఏప్రిల్‌‌ 16న కోర్టు తేల్చిచెప్పింది. ఆర్థికంగా ఎలా హాని కలుగుతుం దో సరైన ఆధారాలివ్వలేదని పేర్కొంటూ కేసును కొట్టేసింది.ఇండియాకు తిరిగి వెళితే ఏమవుతుం దో చెప్పిందే తప్పదానికి సరైన వివరణంటూ ఏమీ ఇవ్వలే దని పేర్కొంది. ‘‘నెలవారీ లోన్లు, ఇతర ఖర్చులు 3711 డాలర్ల (సుమారు ₹2.6 లక్షలు) చెల్లింపునకు జీతమే ఆధారమని సాగర్‌‌‌‌వా లా చెప్పినా .. ఎంతవరకు ఆమె ఆధారపడుతోందో మాత్రం చెప్పలేదు. ఆమె మొత్తం ఆదాయం, ప్రస్తుత ఆర్థిక స్థితిగతులను వెల్లడించలేదు” అని కోర్టు వ్యాఖ్యానించింది.

ముందే జంప్‌ అవ్వొద్దు….

అమెరి కాలో చాలా మంది ఇండియన్లు హెచ్ 1బీ వీసా మీద ఉద్యోగం చేస్తున్నారు. వాళ్లంతా గ్రీన్‌ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి వారి కోసం జాబ్ మారే విషయంలో ముడిపడి ఉన్న వ్యవహారాలను న్యూయార్క్​లోని ఇమిగ్రేషన్​ లాయర్ సైరస్ డీ మెహతా వివరించా రు. ఓ ఉద్యోగి కంపెనీ మారాలంటే.. సదరు కంపెనీ హెచ్ 1బీ వీసా స్టేటస్ పొడిగింపుకు దరఖాస్తు చేయాల్సి ఉంటుందన్నారు. చట్టమూ అందుకు ప్రోత్సహిస్తోందని, కానీ, ఇమిగ్రేషన్​ అధికారుల నుంచి ఆ దరఖాస్తుకు ఆమోదం వచ్చే వరకు వీసా హోల్డర్లు ఉద్యోగం జంప్ కాకుండా ఉంటేనే మేలని అన్నారు. అలా కాకుండా ముందే కొత్త కంపెనీలోకి వెళితే.. హెచ్ 1బీ వీసా స్టేటస్ పొడిగింపుకు చేసుకున్న దరఖాస్తును యూఎస్ సీఐఎస్ తిరస్కరిస్తే కష్టాలు కొనితెచ్చుకున్నట్టేననిన్నారు. దరఖాస్తు రిజెక్ట్​ అయితే వీసాను ఔట్ ఆఫ్ స్టేటస్ గా పరిగణిస్తారన్నారు. ఆ సందర్భం లో పాత కంపెనీ పాత వీసాపై మళ్లీ జాబ్ లో తీసుకుంటే ఏ నష్టమూ ఉండదని, అలా జరిగే సందర్భాలు చాలా చాలా తక్కువని చెప్పారు. ఒక్కసారి ఔట్ ఆఫ్ స్టేటస్ స్టాంప్ పడితే.. వీసా హోల్డర్ తో పాటు అతడు/ఆమె కుటుంబం కూడా దేశం విడిచి వెళ్లాల్సి వస్తుందని immigration.com అనే సంస్థ మేనేజింగ్ అటార్నీ రాజీవ్ ఎస్ ఖన్నా చెప్పారు. మూడు నుంచి పదేళ్ల పాటు దేశంలోకి రాకుండా నిషేధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. డేట్ ముగిసిన వీసాకు గ్రేస్ పీరియడ్ అంటూ ఏమీ ఉండదని అన్నారు.పాత కంపెనీకి సంబంధించి వీసాపై ఇంకా గడువు ఉండి ఉంటే.. 60 రోజలు లేదా వీసా ఒరిజినల్ అప్రూవల్ పై మిగిలిన టైం (ఏది తక్కువైతే అది) వరకు గ్రేస్ పీరియడ్ ఉంటుందని వివరించారు. ఒకవేళ వీసాకు మళ్లీ ఆమోదం దొరక్కపోతే మూడు ఆప్షన్లుంటాయన్నారు. ఒకటి.. నిరాకరించిన అప్లికేషన్​ను మళ్లీ ఫైల్ చేయడం. రెండు.. రెం డోసారి దరఖాస్తు చేసుకోవడం. మూడు.. కోర్టుకెళ్లడం. చివరి రెండు ఆప్షన్లు చాలా టైం తీసుకుంటాయన్నారు ఖన్నా. దరఖాస్తు చేసుకున్ననాటి నుంచి 15 రోజుల్లో యూఎస్ సీ ఐఎస్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, కాబట్టి, కొత్త జాబ్ లోకి వెళ్లే ముందే దరఖాస్తు చేసుకుంటే మంచిదని సూచించారు.

Latest Updates