H2o అంటే హోటలట..

అందాల పోటీల్లో కేవలం క్యాట్ వాక్ లు,బ్యూటీనే కాదు.. తెలివితేటలను కూడా టెస్ట్ చేస్తారు. పోటీలో గెలవాలంటే అందంతో పాటు తెలివి కూడా ఉండాలి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో సెప్టెంబర్.30న జరిగిన మిస్ వరల్డ్ బంగ్లాదేశ్ పోటీల్లో ఓ అందాల భామ ఇచ్చిన ఆన్సర్ తో అక్కడ జడ్జీలు అవాక్కయ్యారు.  క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ లో ఒక కంటెస్టెంట్ ను H2o అంటే ఏంటని జడ్జీలు అడిగారు. ప్రశ్న అర్ధం కాలేదు. రిపీట్ చేయమని ఆమె అడిగింది. జడ్జీలు మరోసారి ఆ ప్రశ్న అడగ్గానే.. అది ఒక రెస్టారెంట్  అని వెంటనే చెప్పింది. ఆమె జవాబుతో కంగు తిన్న జడ్జీలు కాసేపు ఆగి..

అది నీళ్లకు సైంటిక్ ఫార్ములా అని ఆ కంటెస్టెంట్ తో చెప్పారు.  అంతటితో ఆగని ఆ భామ ఆ పేరుతో మా ఊరులో రెస్టారెంట్ ఉందని గట్టిగా చెప్పింది. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వారు. ఢాకాలోనే కాదు ముంబైలో కూడా మరో రెస్టారెంట్‌ ఉందని నిర్వాహకులు అసహనం వ్యక్తం చేశారు. ఆమె ‘సృజనాత్మకత’కు జోహార్లు అంటూ పోటీ నుంచి ఆ కంటెస్టెంట్‌ను తొలగించారు. డిసెంబర్ లో చైనాలో జరిగే  మిస్ వరల్డ్ 2018 పోటీకి అర్హత కోసం ఈ అందాల పోటీలు జరిగాయి.

Posted in Uncategorized

Latest Updates