భర్త ఆచూకీ తెలపాలంటూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్

కరోనాతో గాంధీలో చేరిన తన భర్త ఆచూకీ తెలపాలంటూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు అల్లంపల్లి మాధవి. భర్తతో సహా ఆమె కుటుంబ సభ్యులందరూ కరోనాతో ఆస్పత్రిలో చేరగా, భర్త తప్ప అందరూ డిశ్చార్జి అయ్యారు. తన భర్త గురించి అడిగితే సరైన సమాధానం రాక‌పోవ‌డంతో హైకోర్టు లో పిటిష‌న్ వేసింది. కరోనాతో గాంధీ ఆస్పత్రిలో చేరిన తన భర్త ఆచూకీ చెప్పాలంటూ కోరింది. తన భర్త బతికే ఉన్నా వివరాలు చెప్పడంలేదని.. ఒకవేళ చనిపోతే డెత్ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వడంలేదని తన పిటిషన్ లో ప్రశ్నించింది. తన భర్తను హాజరు పరిచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు… ఆమె భర్త మరణించాడో, బతికున్నాడో చెప్పాలని అధికారులను ఆదేశించింది. ఒకవేళ మరణిస్తే భార్యకు ఎందుకు సమాచారం ఇవ్వలేదో చెప్పాలని స్పష్టం చేసింది. ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణను రేపటికి(శుక్రవారం) వాయిదా వేసింది హైకోర్టు.

Latest Updates