జనవరిలోనే కరోనా వచ్చింది.. ఫ్లూ అనుకున్నా: ఇయాన్ బోథమ్

లండన్: తనకు జనవరిలోనే కరోనా వైరస్ సోకిందని ఇంగ్లండ్ మాజీ ఆల్ రౌండర్ ఇయాన్ బోథమ్​ వెల్లడించాడు. అయితే అప్పట్లో దీని గురించి పెద్దగా చర్చ లేకపోవడంతో ‘బ్యాడ్ ఫ్లూ’ అని తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్పాడు. ‘ ఆరు నెలల కిందట ఎవరికీ దీని గురించి తెలియదు. ఎక్కడా కనిపించలేదు కూడా. డిసెంబర్ ఎండ్ , జనవరి స్టార్టింగ్ లో అనుకుంటా.. ఈ లక్షణాలు ఉన్న ఫ్లూ నాకు అంటుకుంది. కానీ కరోనా అని మాత్రం తెలియదు. ఫ్లూ చాలా తీవ్రంగా వచ్చిందని తప్పుగా అర్థం చేసుకున్నా. దీని గురించి పెద్దగా తెలియకపోవడంతో చాలా రోజులు బాధపడ్డా. కానీ తర్వాత తగ్గిపోయింది. చూద్దాం ఇప్పుడు కూడా ఎన్ని రోజులు ఉంటుందో’ అని బోథమ్​ పేర్కొన్నాడు. జనాలు ఇంకొద్దిగా ఓపిక పడితే… రాబోయే రెండు వారాల్లో పరిస్థితి మరింత మెరుగవుతుందన్నాడు. ఇప్పుడున్న పరిస్థితులకు రెస్పాండ్ అవుతున్న తీరు చాలా బాగుందన్నాడు.