అతనికి సెహ్వగ్ కంటే ఎక్కువ ట్యాలెంట్ ఉంది.. తెలివి లేదంతే..!

పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ అక్తర్ భారత్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వగ్‌ను ఉదహరించి పాక్ బ్యాట్స్ మెన్ కు తెలివిలేదని అన్నాడు. భారత డ్యాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ కంటే చాలా మెరుగైన బ్యాట్స్ మెన్ ఇమ్రాన్ నజీర్ అని చెప్పాడు . అయితే అతని తెలివితక్కువతనంతో నజీర్ వెనకపడిపోతున్నాడని అన్నాడు అక్తర్. ఈ విషయాన్ని బుధవారం.. పాకిస్తాన్ లోని ఓ టీవీ షోలో మాట్లాడుతూ తెలిపాడు అక్తర్. దీంతో పాటు… నజీర్‌ను వాడుకోవడంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వైఫల్యం చెందుతుందని ఆయన అన్నారు. నజీర్ ను ఉపయోగించుకోవాలని పాక్ బోర్డుకు చాలా సార్లు చెప్పానని అయితే వారు వినిపించుకోలేదని తెలిపారు. మనం మనవాళ్లను ఉపయోగించుకోవడంలో విఫలమైతే ఉన్నతిని సాధించలేమని ఆయన పాక్ మీడియాకు ఉదహరించారు.

ఇమ్రాన్ నజీర్ ఓ మ్యాచ్ విన్నర్ అని తనదైన రోజున విరుచుకుపడతారని అన్నారు అక్తర్. అయితే అతనికి చాలా తక్కువ అవకాశాలు వచ్చాయని చెప్పారు. పాక్ తరపున.. అతను కేవలం 8టెస్టులు, 79వన్డేలు, 25టీ20లు మాత్రమే ఆడాడని అన్నారు.  అయితే అక్తర్ ఈ మధ్య భారత బ్యాట్స్ మెన్ పై, భారత వ్యవహారాలపై ఎక్కువగా మాట్లాడుతున్నారు. చివరికి ఆ దేశపు క్రికెటర్ బాగా ఆడుతాడని వారి మీడియాకు చెప్పాలన్నా భారత క్రికెటర్లను ఉదహరిస్తున్నాడు.

Latest Updates