నగరంలో పలు చోట్ల వడగండ్ల వాన

హైదరబాద్ నగరంలో గురువారం సాయంత్రం పలు చోట్ల వడగండ్ల వాన కురిసింది.  పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తన కారణంగా ఈ వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది.  రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలుంటాయని తెలిపింది.

సిటీలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.  పంజాగుట్ట, ఖైరతాబాద్, మణికొండ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. అకాల వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. అనేక ప్రాంతాల్లో చిరు జల్లులు పడగా.. కొన్ని చోట్ల మాత్రం ఓ మాదిరి వర్షం కురిసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా భారీ  వర్షం కురిసింది.  నల్గొండ జిల్లాలో వడగండ్ల వర్షం కురవడంతో మామిడి, వరి పంటలు దెబ్బతిన్నాయి.  దీని కారణంగా భారీ నష్టం వాటిల్లింది.

Hailstorm in several places in Hyderabad city

Latest Updates