ఢిల్లీలో వడగండ్లు.. కూలిన వెయ్యి మంది పేదల ఇళ్లు

 రెండురోజుల కింద ఆకస్మికంగా కురిసిన వాన ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతంలోని పేదలను రోడ్డుపాలు చేసింది. వడగళ్లవాన… నిరుపేదలకు కడగండ్లు మిగిల్చింది. నిమిషాల్లోనే వాతావరణం మారిపోయింది. వెంటనే ఈదురుగాలులతో… వడగండ్ల వర్షం పడింది. ఆ సాయంత్రం మొదలైన వాన.. రాత్రి వేళ కూడా కొనసాగింది. వడగండ్లు తెల్లారేసరికి రోడ్లు, ఇండ్లపైకప్పులు, ఫ్లై ఓవర్లను తెల్లగా మార్చేశాయి. ఈ దృశ్యం చూసేందుకు కశ్మీర్, సిమ్లాలో మాదిరిగా మనోహరంగా.. అనిపించినా .. ఆ రాత్రి నిరుపేదల కు కాళరాత్రే అయింది.

గ్రేటర్ నోయిడాలోని 150 ఇండ్లు కూలిపోయాయి. గుడిసెలు ఎగిరిపోయాయి. వెయ్యి మంది పేదలు, కూలీలు రోడ్డున పడ్డారు. గూడు చెదిరిపోవడంతో.. వడగళ్లవానలో.. ఆ రాత్రి పేదలు అష్టకష్టాలు పడ్డారు. ఆరుగురు చిన్నపిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో అనుమతి పొంది ఇళ్లు కట్టుకున్నవారికి మాత్రమే పరిహారం అందిస్తామని దాద్రి అధికారులు చెప్పారు.

Latest Updates