హజీపూర్ ఘటన: 27న ఫైనల్ తీర్పు

నల్గొండ: యాదాద్రి భువనగిరి జిల్లా హజీపూర్ లో ముగ్గురు మైనర్ బాలికలను అత్యాచారం, హత్య చేసిన కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి మరణ శిక్ష విధించాలని కోర్టును కోరారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. శుక్రవారం నల్గొండ కోర్టులో హాజీపూర్ హత్యల కేసులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న ఫోక్సో కోర్టు తీర్పును 27కు రిజర్వ్ చేసింది. శ్రీనివాస్‌ రెడ్డే బాలికలను హత్య చేశాడని చెప్పడానికి అన్ని ఆధారాలు ఉన్నాయంటూ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కోర్టుకు వివరించారు.

నిందితుడికి గతంలో కూడా నేర చరిత్ర ఉందని.. ఈ కేసును అత్యంత అరుదైన కేసుగా పరిగణించి నిందితుడికి మరణ శిక్ష విధించాలని న్యాయస్థానాన్ని కోరారు. నిందితుడి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. శ్రీనివాసరెడ్డికి.. ఈ కేసుతో అసలు సంబంధమే లేదన్నారు. రెండు వైపులా వాదనలను విన్న న్యాయస్థానం… ఫైనల్ తీర్పును 27కు వాయిదా వేసింది.