పోలీసుల కస్టడీకి సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డి

hajipur-killer-srinivas-reddy-in-police-custody

రాష్ట్రంలో సంచలనం స్పష్టించిన హాజీపూర్ బాలికల హత్య కేసులో సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డిని ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు నల్గొండ పోలీసులు. జిల్లా కోర్టు అనుమతితో ఇవాళ సెంట్రల్ జైలు నుంచి శ్రీనివాస్ రెడ్డిని కస్టడీకి తీసుకున్నారు. ప్రత్యేక బెటాలియన్ తో సెంట్రల్ జైలుకు వెళ్లిన అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి.. శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

హత్యల కేసులో మరిన్ని వివరాలు సేకరించేందుకు శ్రీనివాస్ రెడ్డిని విచారిస్తామంటున్నారు పోలీసులు. నిందితుడిపై ఇతర నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయా అన్న కోణంలోనూ దర్యాప్తు జరగాల్సి ఉందన్నారు.

హాజీపూర్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వ్యవసాయ బావిలో పూడ్చిపెట్టిన ఇద్దరు విద్యార్థినులను గుర్తించేందుకు శాస్త్రీయమైన ఆధారాల కోసం వారి కుటుంబ సభ్యులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నారు.

Latest Updates