శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాలి: బాధిత కుటుంబాలు

hajipur-parents-of-victims-demand-to-hanging-srinivas-reddy

అమాయకురాళ్లైన ఆడపిల్లల్ని అత్యాచారం చేసి, ఆపై దారుణంగా హత్య చేసిన హాజిపూర్ నిందితుడు శ్రీనివాస్ రెడ్డిపై బాధిత కుటుంబాలు భగ్గుమంటున్నాయి. అతడిని ఉరి తీయాలని బాధిత తల్లిదండ్రులు ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కేసు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. బొమ్మలరామారం మండల కేంద్రంలో దీక్ష చేయాలని బాధితుల తల్లిదండ్రులు నిర్ణయం తీసుకున్నారు. వారి దీక్షకు గ్రామస్థులు, ప్రజా సంఘాల నేతలు  మద్దతు తెలిపారు.

Latest Updates