హాజీపూర్ రేపిస్టుకి శిక్ష ఎప్పుడు?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితులను 9 రోజుల్లోనే ఎన్ కౌంటర్ లో హతమార్చడంతో ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు సరైన న్యాయం జరిగిందంటున్నారు. ఇలాంటి  ఘటనకే యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని కూడా ఎన్ కౌంటర్ చేయాలంటూ బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. నిందితుడిని అరెస్టు చేసి పది నెలలు గడుస్తున్నా… కేసు ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాస్ రెడ్డిని బహిరంగంగా ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హాజీపూర్ ఘటనను ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

అభం శుభం తెలియని ముగ్గురు బాలికలపై అత్యాచారం జరిపి, ఆపై హత్య చేసిన కేసులో శ్రీనివాస్ రెడ్డి నిందితుడు. గ్రామానికి చెందిన శ్రావణి, మనీషా, కల్పన లను వేర్వేరు ఘటనల్లో అత్యాచారం, హత్య చేసి తన పొలంలోని బావిలోనే పూడ్చిపెట్టాడు. శ్రావణి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేసిన పోలీసులు జనం మధ్యలోనే ఏం ఎరుగనట్టు తిరుగుతున్న శ్రీనివాస్ రెడ్డే నిందితుడనీ తేల్చి అరెస్ట్ చేశారు.  ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటనతో ఆగ్రహావేశాలకి లోనైన ప్రజలు నిందితుడిని ఇంటిని తగులబెట్టారు. ఈ కేసులో నిందితుడికి ఇంకా ఎటువంటి శిక్ష వేయకపోవడంతో ప్రజలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

Hajipur  Victims' families have also demand  Similar Justice

Latest Updates