శ్రీనివాస్ రెడ్డి ఇంటిని తగలబెట్టిన గ్రామస్థులు

hajipur-villagers-attack-on-srinivas-reddy-house

యాదాద్రి భువనగిరి:  జిల్లాలోని బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రావణి హత్య కేసులో ప్రధాన నిందితుడైన శ్రీనివాస్ రెడ్డి ఇంటికి గ్రామస్థులు నిప్పు పెట్టారు. ఒక హత్య కేసు దర్యాప్తు చేస్తుంటే.. మరో మృతదేహం అస్థికలు కనిపించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులకు సంబంధించి నిందితుడిగా భావిస్తున్న శ్రీనివాస్‌రెడ్డి నివాసంపై ఇవాళ ఉదయం గ్రామస్థులు దాడి చేశారు. ఇంటికి నిప్పంటించారు. ఇంట్లోని సామానంతా తెచ్చి మంటల్లో పడవేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. గ్రామస్తులు శాంతించ లేదు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు బాలికల మరణానికి కారణంగా భావిస్తున్న శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

Latest Updates