టైమింగ్స్ ఇవే: 16 నుంచి ఒంటిపూట బడులు

హైదరాబాద్‌ : ఆఫ్ డే స్కూల్, సమ్మర్ హలిడేస్ తేదీలను ఖరారు చేసింది విద్యాశాఖ. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్ కు మార్చి 16 నుంచి ఆఫ్ డే స్కూల్స్ ప్రారంభమవుతాయని తెలిపారు పాఠశాల విద్యా కమిషనర్‌ చిత్రారామచంద్రన్‌. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు స్కూల్స్  టైమింగ్స్ ఉంటాయని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం చేశాకా విద్యార్థులను ఇంటికి పంపించాలని తెలిపారు. అలాగే ఏప్రిల్‌ 23వ తేదీ నుంచి స్కూల్స్ కు వేసవి సెలవులు ఉంటాయని.. జూన్‌ 12న తిరిగి ప్రారంభం కానున్నాయని తెలిపారు.

See Also: రేవంత్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ పై ముగిసిన విచారణ

Latest Updates