జాబ్​ పోయినోళ్లకు కూడా సగం జీతం: లేబర్ మినిస్ట్రీ

జాబ్​ పోయిన ఈపీఎఫ్ఓ​ మెంబర్లకు సగం జీతం

కరోనాకాలంలో జాబ్‌‌ పోయినోళ్లకు మాత్రమే

3 నెలల జీతంలో సగం చెల్లింపు

న్యూఢిల్లీ: కరోనా లాక్‌‌డౌన్‌‌ వల్ల జాబ్స్‌‌ పోగొట్టుకున్న వారికి నగదు సాయం చేస్తామని కేంద్ర లేబర్‌‌ మినిస్ట్రీ ప్రకటించింది. వీరి కోసం అటల్‌‌ బీమిత్‌‌ వ్యక్తి కళ్యాణ్‌‌ యోజనను అమలు చేస్తామని వెల్లడించింది.  ఈ ఏడాది మార్చి నుంచి వచ్చే ఏడాది జూన్‌‌లోపు జాబ్స్ కోల్పోయేవారికి, ఇప్పటికే జాబ్‌‌పోయిన వారికి సాయం చేస్తామని ప్రకటించింది. ఈ స్కీమ్‌‌ అర్హులకు తమ మూడు నెలల జీతంలో సగం మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ మేరకు లేబర్‌‌ మినిస్ట్రీ శనివారం నోటిఫికేషన్‌‌ జారీ చేసింది.  దాదాపు 41 లక్షల మంది నిరుద్యోగులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని, ఈ స్కీమ్‌‌ అమలు వల్ల ప్రభుత్వానికి రూ.6,700 కోట్లు ఖర్చవుతాయని ఈపీఎఫ్‌ అంచనా వేసింది. ఎలిజబిలిటీ ఉన్న ఈఎస్‌‌ఐ సభ్యులు తాము చివరిగా తీసుకున్న జీతం మొత్తంలో సగాన్ని చెల్లిస్తారు. మూడు నెలల మొత్తాన్ని ఖాతాల్లో జమచేస్తారు.

ఎవరు అర్హులంటే…

నెలకు జీతం రూ.21వేలలోపు ఉండి, ఈఎస్‌‌ఐకి చందా చెల్లించే ఇండస్ట్రియల్‌‌ వర్కర్లు ఈ స్కీమ్‌‌కు అర్హులు. కనీసం రెండేళ్లపాటు ఏదైనా కంపెనీలో పనిచేసి ఉండాలి. జాబ్‌‌ పోవడానికి ముందు కనీసం 78 రోజులపాటు ఈఎస్‌‌ఐ చందా కట్టి ఉండాలి.  లాక్‌‌డౌన్‌‌ టైంలో చందా కట్టని 30 లక్షల మంది, మార్చిదాకా చందా చెల్లించని 11.61 లక్షల మంది కూడా ఈ స్కీమ్‌‌కు అర్హులేనని ఆఫీసర్లు చెప్పారు.  నిరుద్యోగ భృతి కోసం బాధితులు ఆన్‌‌లైన్‌‌లో ఈఎస్‌‌ఐకు అప్లై చేసుకోవాలి. అక్కడి ఆఫీసర్లే వెరిఫికేషన్‌‌ చేస్తారు. ఆధార్‌‌ సంఖ్య ద్వారా ఈ పనిని పూర్తి చేస్తారు. 15 రోజుల్లోపే డబ్బులను ఖాతాల్లో వేస్తారు. కరోనా లాక్‌‌డౌన్‌‌ వల్ల జాబ్స్‌‌ పోవడంతో గత కొన్ని నెలల్లో దాదాపు 80 లక్షల మంది వర్కర్లు ఈఎస్‌‌ఐకి చందా కట్టడం మానేశారు.

త్వరలో వడ్డీ చెల్లించనున్న ఈపీఎఫ్‌‌ఓ

ఎంప్లాయీస్‌‌ ప్రావిడెంట్‌‌ ఫండ్‌‌ ఆర్గనైజేషన్‌‌ (ఈపీఎఫ్‌‌ఓ) చందా కట్టే ఉద్యోగుల పీఎఫ్‌‌ ఖాతాల్లో 2019–20 ఆర్థిక సంవత్సరానికి త్వరలోనే వడ్డీ జమ చేయనుంది. ఏడాదికి 8.5 శాతం చొప్పున వడ్డీ వస్తుందని ఈపీఎఫ్‌‌ఓ సెంట్రల్‌‌బోర్డు ప్రకటించింది. మొదట 8.15 శాతం వడ్డీని జమచేస్తారు. మిగతా 0.15 శాతం వడ్డీని డిసెంబరుకల్లా చెల్లిస్తారు. ఈపీఎఫ్‌‌ఓ వెబ్‌‌సైట్‌‌ లేదా ఉమంగ్‌‌ యాప్‌‌ ద్వారా పాస్‌‌బుక్‌‌ను చెక్‌‌ చేసుకోవచ్చు.

ఈపీఎఫ్‌‌ఓ బ్యాలెన్స్‌‌ను ఎలా చెక్‌‌ చేయాలంటే..

మెంబర్‌‌ ఐడీని సెలెక్ట్‌‌ చేసుకోవాలి. వెంటనే ఈపీఎఫ్‌‌ పాస్‌‌బుక్‌‌ కనిపిస్తుంది. ఎంప్లాయర్‌‌, ఎంప్లాయి చెల్లించిన మొత్తం, ఈపీఎఫ్‌‌ నుంచి వచ్చిన వడ్డీ వంటి వివరాలన్నీ అందులో ఉంటాయి

కావాలనుకుంటే పీడీఎఫ్‌‌ కాపీని కూడా డౌన్‌‌లోడ్‌‌ చేసుకోవచ్చు

ఉమంగ్‌‌ యాప్‌‌లో అయితే ఈపీఎఫ్‌‌ఓ సర్వీసెస్‌‌పై క్లిక్‌‌ చేయాలి. తరువాత కనిపించే ఎంప్లాయి సెంట్రిక్‌‌ సర్వీసెస్‌‌ను సెలెక్ట్‌‌ చేయాలి.

వెంటనే పాస్‌‌బుక్‌‌ ఆప్షన్‌‌ కనిపిస్తుంది. యూజర్‌‌నేమ్‌‌, పాస్‌‌వర్డ్‌‌, క్యాప్చ ఎంటర్‌‌ చేయాలి. మొబైల్‌‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌‌ చేస్తే పాస్‌‌బుక్‌‌ డౌన్‌‌లోడ్‌‌ అవుతుంది.

For More News..

ట్యాక్స్​ లెక్కల్లో తేడాలున్నయని​ 5 కోట్లు లంచం అడిగిన్రు

రోడ్డు మధ్యలో మంత్రి ప్రోగ్రాం.. దారి మళ్లిన అంబులెన్స్

రెండున్నరేళ్ల కిందటి ‘రైతుబంధు’ ఇప్పుడిచ్చిన్రు

Latest Updates