హామిల్టన్ రికార్డు విక్టరీ.. టైర్ పంక్చర్ అయినా ఆగలేదు..

సిల్వర్ స్టోన్‌‌‌‌: మెర్సిడెస్‌ ‌‌‌డ్రైవర్ లూయిస్‌ ‌‌‌హామిల్టన్‌ అనుకున్నది సాధించాడు. బ్రిటిష్‌ గ్రాండ్‌‌‌‌ప్రిలో ఏడోసారి టైటిల్‌ నెగ్గాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో పోల్‌ పొజిషన్‌ నుంచి రేసు ప్రారంభించిన లూయిస్‌‌‌‌ చివరి ల్యాప్‌లో తన కార్‌‌‌‌ టైర్ పంక్చర్ అయినా కూడా పోడియం ఫినిష్‌‌‌‌చేశాడు. ఫ్రంట్‌ ‌‌‌లెఫ్ట్‌ ‌‌‌టైర్ దాదాపు రిమ్‌నుంచి ఊడిపోయే వరకూ వచ్చినా లైన్‌ దాటగలిగాడు. 1:28:01.283 టైమింగ్‌తో టాప్‌ ప్లేస్‌‌‌‌లో నిలిచాడు. రెడ్‌‌‌‌బుల్‌ డ్రైవర్ వెర్ మ్యాక్స్‌ వెర్ స్టాపెన్‌(+5.856 సె.) రన్నరప్‌గా నిలిచాడు. ఈ విజయంతో షుమాకర్ ఆల్‌టైమ్‌ రికార్డు(91 టైటిల్స్‌)కు హామిల్టన్ నాలుగు విజయాల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం హామిల్టన్ 87 టైటిల్స్ సాధించాడు.

For More News..

అప్పుడు కోట్లు సంపాదించిన టిక్‌‌టాక్‌ స్టార్లు.. మరి ఇప్పుడు?

కరోనా వ్యాక్సిన్స్ డబ్బున్నోళ్లకే ఫస్ట్

తమిళనాడులో మత్స్యకారుడి హత్య.. 20 పడవలకు నిప్పు

Latest Updates