అలర్ట్: శానిటైజర్లతో పిల్లల కళ్లకు ప్రమాదం

ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వైరస్ ను కట్టడి చేయవచ్చు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడంతో పాటు తరచుగా చేతులను శానిటైజర్లతో శుభ్రం చేసుకోవాలి. అయితే శానిటైజర్లతో మంచి తో పాటు ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా పిల్లలు…శానిటైజ్ చేసిన చేతులతో కళ్లను తాకడంతో ముప్పుతప్పదంటున్నారు సైంటిస్టులు. శానిటైజర్‌ను వాడిన తర్వాత చిన్నారులు అవే చేతులతో కళ్లను తాకినప్పుడు ప్రమాదకర రసాయనాలు కళ్లలోకి చేరి సమస్యలు వస్తాయంటున్నారు ఫ్రెంచ్ పాయిజన్ కంట్రోల్ సెంటర్ శాస్త్రవేత్తలు. దీని ఫలితంగా కొందరు పిల్లల ఆరోగ్యం విషమిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి కంటి సమస్యలతో డాక్టర్ల దగ్గరకు వస్తున్న పిల్లల సంఖ్య గతేడాదితో పోలిస్తే..2020 సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి అగస్టు 24 మధ్యకాలంలో ఏకంగా ఏడు రెట్లు పెరిగాయని తెలిపారు. 2019 సంవత్సరంలో పిల్లల కంటి సమస్యల్లో 1.3 శాతం కేసులే హ్యాండ్ శానిటైజర్‌తో వచ్చినవి… కాగా, 2020 లో అవి ఒక్కసారిగా 9.9 శాతానికి పెరిగాయన్నారు సైంటిస్టులు.

Latest Updates