8 రోజుల్లో .. 300 కి.మీ.- పోలియోను సైతం లెక్క చేయకుండా మహిళ నడక

కాగజ్ నగర్, వెలుగు: అసలే పోలియో..అడుగు తీసి అడుగు వేసుడే ఎంతో కష్టం. అయితే కరోనా మహమ్మారి ఆమెను మైళ్లు నడిచేలా చేసింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు చెందిన లక్ష్మీబాయ్ కొన్ని నెలల క్రితం ఉపాధి కోసం ఖమ్మం జిల్లాకు వచ్చింది. లాక్ డౌన్​ విధించడంతో అక్కడ
పని లేకుండా పోయింది. దీంతో చేసేదిలేక ఎటువంటి వాహనాలు లేకపోవడంతో 8 రోజుల కిందట సొంతూరుకు తోటి కూలీలతో కలిసి కాలినడకన బయలుదేరింది.

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టీ)కి శనివారం మధ్యాహ్నం చేరుకుంది. ఇప్పటికే 300 కి.మీ. పైగా నడిచిన ఆ మహిళా కూలీ అవస్థను చూసిన సిర్పూర్ కేర్స్​స్వచ్ఛంద సంస్థ వాళ్లు ఆమెకు భోజనం అందించి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. కష్టాన్ని ఓర్చుకొని తోటి కూలీలతో కలిసి వెళ్తున్నానని, దారిలో 10 కి.మీ. దూరం లారీ దొరికిందని, మిగతా అంతా నడుచుకుంటూ వెళ్లడమేనని చెప్పింది. సోమవారం సాయంత్రానికి ఇంటికి చేరతానని పేర్కొంది.

మరిన్ని వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

Latest Updates