అధికారాన్ని జో బైడెన్ కు అప్పగిస్తా: ట్రంప్

అమెరికా నూతన అధ్యక్ష వివాదం ముగిసింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు చేసిన డోనాల్డ్ ట్రంప్ చివరకు తన ఓటమిని ఒప్పుకున్నారు. అంతేకాదు.. జో బైడెన్ కు అధికారాన్ని అప్పగిస్తున్నానని స్పష్టం చేశారు.అమెరికా 46వ అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను అమెరికా పార్లమెంటు ఖరారు చేసింది. ఈ క్రమంలోనే ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. దేశాధ్యక్ష ఎన్నికల ఫలితాలు తనకు సంతృప్తికరంగా లేనప్పటికీ, నిబంధనలు పాటిస్తూ అధికారాన్ని జో బైడెన్ కు అప్పగిస్తున్నానని తెలిపారు.

జనవరి 20న జరిగే అధికార మార్పిడికి సంపూర్ణ సహకారం అందిస్తానని తెలిపారు ట్రంప్. ఎన్నికల ఫలితాలపై తమ పోరాటం మాత్రం ఆగదన్నారు. అమెరికా తన గత వైభవాన్ని పొందేందుకు చేసే పోరాటంలో ఇది ప్రారంభం మాత్రమేనని తెలిపారు. అంతేకాదు 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు ట్రంప్ ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది.

Latest Updates