అమిత్‌షా, కేంద్రంపై మమత ఫైర్‌‌

  • కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
  • పొలిటికల్‌గా దెబ్బతీసేందుకు ప్రయత్నం చేస్తున్నారన్న దీదీ

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, కేంద్ర ప్రభుత్వం మధ్య పొలిటికల్‌ వార్‌‌ రోజు రోజుకు ముదరుతోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్‌ షాపై దీదీ తీవ్ర విమర్శలు చేశారు. అమిత్‌షా, తన మధ్య జరిగిన సంభాషణలను దీదీ మీడియాతో చెప్పారు. వైరస్‌ను కంట్రోల్‌ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఆరోపిస్తున్న హోం మంత్రి అమిత్‌ షా తానే స్వయంగా ఎందుకు రంగంలోకి దిగడం లేదో చెప్పాలని అన్నారు. అంతే కాకుండా శ్రామిక్‌ రైళ్ల విషయంలో రైల్వే మంత్రి పాలిటిక్స్‌ ప్లే చేస్తున్నారని అన్నారు. “ పదే పదే బెంగాల్‌కు సెంట్రల్‌ టీమ్‌ను పంపిస్తున్నారు మంచిదే. బెంగాల్‌ ప్రభుత్వం కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోలేక పోతోందని మీకు అనిపిస్తే మీరే డైరెక్ట్‌గా హ్యాండిల్‌ చేయండి అని అమిత్‌షాతో అన్నాను. ‘ లేదు లేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేం ఎలా డిస్‌లాడ్జ్‌ చేస్తాం’ అని షా చెప్పారు. నేను దానికి థ్యాంక్స్‌ చెప్పాను” అని మమత బెనర్జీ మీడియాతో చెప్పారు. నిజానికి ఈ విషయాలన్నీ బయట పెట్లాలనే ఉద్దేశం తనకు లేదని, ఇప్పుడు చెప్పాల్సిన టైం వచ్చింది కాబట్టి చెప్తున్నానని ఆమె అన్నారు. లాక్‌డౌన్‌ విధించి రైళ్లు, విమానాలు నడపడం ఎందుకని మమత ఫైర్‌‌ అయ్యారు. “ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా చూడాలని ప్రధాని, హోం మంత్రిని కోరుతున్నాను. ఇప్పటికే లక్ష కేసులు దాటినయి. కొంత మంది వాటితో పాలిటిక్స్‌ చేయాలని చూస్తున్నారు. బీహార్‌‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో కూడా వైరస్‌ వ్యాప్తి జరుగుతోంది. ఇలాంటి టైంలో నేను ఏమి చేస్తా? ఈ కష్టంకాలంలో పీఎం కలుగజేసుకుని ఆదుకోవాలి” అని మమత అన్నారు. తనను ఇబ్బంది పెట్టేందకే మహారాష్ట్ర నుంచి ఒకేసారి 36 రైళ్లలో వలస కూలీలను బెంగాల్‌కు తరలిస్తున్నారని ఆమె ఆరోపించారు. పొలిటికల్‌గా డిస్ట్రబ్‌ చేసేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారని, కానీ అది బెంగాల్‌కు ఇబ్బంది కలిగిస్తోందని అన్నారు. “ ఒకవైపు కరోనాతో పోరాడుతున్నాం, మరోవైపు సైక్లోన్‌. ఇప్పుడు వాళ్లు ట్రైన్లు పంపిస్తున్నారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించలేదు. మాకు షెడ్యూల్‌ చెప్పలేదు. వాళ్లకు రాజకీయంగా ఎలా లబ్ధి చేకూరుతుందో అలానే చేస్తున్నారు” అని దీదీ ఫైర్‌‌ అయ్యారు. అయితే మమత చేసిన ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. ఆమె కావాలనే ఆరోపణలు చేస్తున్నారని బెంగాల్‌ బీజేపీ చీఫ్‌ అన్నారు. బెంగాల్‌లో కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంతో బెంగాల్‌ సర్కార్‌‌ ఫెయిల్ అయిందని, శ్రామిక్‌ రైళ్లను రానివడం లేదని అమిత్‌ షా అన్నారు. ఈ నేపథ్యంలో మొదటి నుంచి వారిద్దరి మధ్య పొలిటికల్‌ వార్‌‌ నడుస్తూనే ఉంది.

Latest Updates