యూపీ గురించి కాదు.. మహారాష్ట్ర గురించి ఆలోచించండి

  • సంజయ్‌రౌత్‌కు కౌంటర్‌‌ ఇచ్చిన ఆదిత్యనాథ్‌

న్యూఢిల్లీ: శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌కు ఉత్తర్‌‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ గట్టి కౌంటర్‌‌ ఇచ్చారు. యూపీ గురించి ఆలోచించడం మానేసి మహారాష్ట్ర గురించి ఆలోచించాలని సూచించారు. ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని బులంద్‌హషర్‌‌లో సాధువుల హత్యకు సంబంధించి స్పందించిన సంజయ్‌ రౌత్‌.. ఆ హత్యను మత పరమైన అంశంగా మార్చొద్దని సూచించారు. మహారాష్ట్రలో పాల్గర్‌‌లోని సాధువుల హత్యను తాము డీల్‌ చేసిన విధంగానే డీల్‌ చేయాలని ట్వీట్‌ చేశారు. దీనికి ఆదిత్యనాథ్‌ రిప్లై ఇచ్చారు. “ మీరు మహారాష్ట్ర గురించి ఆలోచించండి.. యూపీ గురించి కాదు. యూపీలో రూల్‌ ఆఫ్‌ లా ఉంది. దాన్ని పక్కాగా అమలు చేస్తాం. బులంద్‌హషర్‌‌ ఘటనకు సంబంధించి చర్యలు తీసుకుంటాం” అని యోగి ఆదిత్యనాథ్‌ ఆఫీస్‌ ట్వీట్‌ చేసింది. బులంద్‌హషార్‌‌లోని ఒక గుడిలో ఇద్దరు పూజార్లు హత్యకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించి మురారీ అలియాస్‌ రాజు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. ఈ విషయంపై మట్లాడేందుకు ఆదిత్యనాథ్‌కు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే ఫోన్‌ చేశారు. ఘటనపై ఆరా తీసిన థాక్రే నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. అయితే ఈ ఘటన మతపరంగా సున్నితమైందని, తాము సాధువుల హత్యలను ఎలా హ్యాండిల్‌ చేశామో అలానే వ్యవహరించాలని కోరారు.

Latest Updates