స్టోర్ రూమ్ లో సీజ్ చేశారు : పేలిన 90 నాటు బాంబులు

పుణెలోని అటవీ కార్యాలయంలో నాటు బాంబులు పేలాయి. ఈ ధాటికి ఆఫీస్ భవనం పాక్షికంగా దెబ్బతింది. వేటగాళ్ల నుంచి సీజ్ చేసిన 90 నాటు బాంబులను ఫారెస్ట్ అధికారులు పుణెకు 30 కిలోమీటర్ల దూరంలోని అటవీ కార్యాలయం స్టోర్ రూమ్ లో సీజ్ చేసి పెట్టారు. ఇవి కాస్తా పేలిపోయాయి. బాంబులు పేలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. తాంహిని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో అడవి జంతువులను చంపేందుకు వేటగాళ్ల సమకూర్చుకున్న బాంబులను ఫారెస్ట్ అధికారులు ఇటీవలే స్వాధీనం చేసుకున్నారు. అయితే పందికొక్కులు కొరకడం లేదంటే, అత్యంత వేడి కారణంగా 90 చిన్నసైజు నాటు బాంబులు పేలి ఉంటాయని అనుమానిస్తున్నారు.

Latest Updates