30న తీహార్‌ జైలుకు తలారి పవన్‌

నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు కానుంది.ఈ క్రమంలో నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తలారి పవన్‌ జల్లాద్‌ను తీహార్‌ జైలు అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 30వ తలారి పవన్‌ తీహార్‌ జైలుకు చేరుకుంటారని తెలిపారు. నిర్భయ కేసులో అక్షయ్‌ ఠాకూర్‌, పవన్‌ గుప్తా, ముఖేష్‌ సింగ్‌, వినయ్‌ శర్మ దోషులుగా ఉన్నారు.

2012 డిసెంబర్‌ 16వ తేదీ రాత్రి ఢిల్లీలో కదిలే బస్సులో నిర్భయపై అంత్యంత దారుణంగా లైంగికదాడి చేసి.. ఆమె చనిపోవడానికి కారణమైన నలుగురు దోషుల్ని ఫిబ్రవరి 1న ఉదయం 7 గంటలకు తీహార్‌ జైల్లో ఉరి తీయనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసేపనిలో బిజీగా ఉన్నారు.

Latest Updates