మోడీతో చంద్రయాన్​ చూడనున్నహన్మకొండ స్టూడెంట్​

కేయూ క్యాంపస్, వెలుగు: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో  నిర్వహించిన ఆన్​లైన్ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన కె. పార్థివ్ కు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 7న ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి బెంగళూరులోని ఇస్రో కార్యాలయంలో చంద్రయాన్​ -2 లాండింగ్​ను లైవ్​లో​చూసేందుకు ఇస్రో నుంచి ఆహ్వానం లభించింది. రాష్ట్రం నుంచి ఇద్దరు స్టూడెంట్లకు ఆహ్వానం అందగా హన్మకొండ పోచమ్మకుంట తేజస్వి స్కూల్​లో నైన్త్ క్లాస్ చదువుతున్న కె. పార్థివ్​ అందులో ఒకరు. తమ స్కూల్ లో చదువుతున్న స్టూడెంట్​కు ఇస్రో నుంచి ఆహ్వానం దక్కడం చాలా సంతోషంగా ఉందని తేజస్వి విద్యాసంస్థల చైర్మన్​ ఆర్​. జెన్నారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పార్థివ్ ను , అతని తల్లిదండ్రులను పాఠశాల హెడ్​మాస్టర్​జి. సంధ్యారాణి అభినందించారు.

 

Latest Updates