యూనివర్సిటీ విద్యార్ధులకు సింహ స్వప్నం : అయ్యో ఈ మహిళా నేతకు ఎంతకష్టం ఎంత కష్టం

ఉత్తరా ఖండ్ అల్మోరా జిల్లా సోమేశ్వర్ కు చెందిన విద్యార్ధి నాయకురాలు హన్సీ ప్రహరి  కుమావున్ యూనివర్సిటీలో స్టూడెంట్ ఫైర్ బ్రాండ్. తోటీ విద్యార్ధులకు సింహస్వప్నం. వారికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకు నడించేది. అంతకు మించి మంచి వాగ్ధాటి. ఏ టాపిక్ అయినా అనర్గళంగా మాట్లాడుతూ విద్యార్ధి సంఘానికి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించింది. అదే హవాతో రాజకీయం రంగప్రవేశం చేసి జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకుంది. ఇప్పుడు అదే డబుల్ పీజీ చేసిన యూనివర్సిటీ నాయకురాలు నేడు యాచకురాలిగా జీవితం కొనసాగిస్తుంది.

యూనివర్సిటీ విద్యార్ధి సంఘానికి నాయకురాలిగా, ఫైర్ బ్రాండ్ గా చెరగని ముద్ర వేయించుకున్న హన్సీ ప్రహరి..2002లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఉత్తరా ఖండ్ సోమేశ్వర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రస్తుత రాజ్యసభ ఎంపీ, నాటి ఎమ్మెల్యే అభ్యర్ధి  ప్రదీప్ టమ్ టాపై పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో హన్సీ ప్రహారి ఓడిపోయారు. అభ్యర్ధి ప్రదీప్ విజయం సాధించారు. ఆ ఎన్నికల ఓటమి నుంచి బయటపడేందుకు వివాహం చేసుకుంది. వైవాహిక జీవితంలో అనేక ఒడిదుడుకులు. భర్త నుంచి అవమానాలు. ఇవన్నీ హన్సీని బాగా కుంగదీశాయి. భర్త వేధింపులు తట్టుకోలేక తన కుమారుడితో ఇంట్లోని బయటకు వచ్చేసింది.

తనకు డబుల్ పీజీలు ఉన్నాయని, ప్రభుత్వం తనని ఆదుకోవాలంటూ ఉత్తరా ఖండ్ సెక్రటరియేట్ కాళ్లరిగేలా తిరిగింది. అయినా ఎవరూ పట్టించుకోలేదు.

రంగుల జీవితం చీకటి మయమైంది. చదువుకున్న చదువు తనని ఆదుకోలేకపోయింది. కట్టుకున్న భర్త వేధింపులు. వెరసీ కొడుకుకోసం బిక్షాటన చేస్తుంది. ప్రస్తుతం హన్సీ ప్రహారి బిక్షాటన చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హన్సీ గురించి సమాచారం అందుకున్న ఎంపీ ప్రదీప్ టమ్ టా స్పందించారు. జరిగిందేదో జరిగింది. హన్స్ ఫౌండేషన్ ద్వారా హన్సీని ఆదుకుంటామని తెలిపారు. హన్సీని స్వయంగా కలుసుకోలేకపోయినట్లు చెప్పిన ప్రదీప్..హరిద్వార్ కేంద్రంగా స్వచ్ఛంద సంస్థలు ఆమెను ఆదుకోవాలని కోరారు.

Latest Updates