జై భజరంగ్ బలి : ఘనంగా హనుమాన్ శోభాయాత్ర

హైదరాబాద్‌: సిటీలో ఏ గల్లి చూసినా హనుమాన్ పాటలతో మారుమోగుతున్నాయి. యువత  బైక్ ర్యాలీ చేస్తూ ఆంజనేయుడిపై ఉన్న భక్తిని చాటుకున్నారు. జై భజరంగ్ దళ్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. హనుమాన్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో శోభాయాత్ర ఘనంగా కొనసాగుతోంది. విశ్వ హిందూ, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యాత్రలో పెద్ద ఎత్తున భక్తులు ర్యాలీలో పాల్గొన్నారు. గౌలిగూడ నుంచి తాడ్బండ్ వరకు ఈ శోభాయాత్ర కొనసాగనుంది.

12.5 కిలోమీటర్లు జరిగే శోభాయాత్రకు 12 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 450 సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. హనుమాన్‌ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ తాడ్బండ్ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. హనుమాన్ టెంపుల్స్ దగ్గర అన్నదానాలు. మజ్జిగ పంపిణీలు చేస్తున్నారు ఆలయ అధికారులు.

 

 

Latest Updates