పవర్ ఫుల్ ఇయర్ అవ్వాలి.. పవన్ కు సెలబ్రిటీస్ విషెస్

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బుధవారంతో 49వ బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పవన్ బర్త్ డే విషెస్ తో ఇంటర్నెట్ హోరెత్తుతోంది. ప్రతి ఏడాది పవన్ పుట్టినరోజును ఫ్యాన్స్ ఘనంగా జరుపుకుంటారు. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది సెలబ్రేషన్స్ ను సాధారణంగా జరుపుకోవాలని ఫ్యాన్స్ కు పవన్ కోరారు. దీన్ని పక్కనబెడితే టాలీవుడ్ సెలబ్రిటీలు పవన్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. మహేశ్ బాబు, అల్లు అర్జున్, రవితేజ, సమంత, రకుల్ ప్రీత్ సింగ్ తోపాటు పలువురు సెలబ్రిటీలు పుట్టిన రోజు శుభాభినందనలు తెలిపారు.

గొప్ప ఙానంతోపాటు బాధ్యతలతో ముందుకెళ్లాలి అంటూ సమంత ట్వీట్ చేసింది. హ్యపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ గారు అని బన్నీ ట్వీట్ చేశారు.

మీ దయ, వినయం ఎప్పుడూ మార్పును కోరుకుంటాయని మహేశ్ బాబు ట్వీట్ చేయగా.. మంచి మిత్రుడు, నిజమైన జెంటిల్ మేన్ అయిన పవన్ గారు ఈ రోజు ఎంజాయ్ చేయండంటూ రవితేజ ట్వీట్ చేశారు. పవర్ స్టార్ కు ఈ ఏడాది మోస్ట్ పవర్ ఫుల్ అవ్వాలని రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేసింది.

Latest Updates