మంత్రగాళ్లంటూ వేధింపులు : గోదావరిలో దూకిన దంపతులు

వెల్గటూర్, వెలుగు: గ్రామస్తుల వేధింపులు భరించలేక వృద్ధ దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని కోటిలింగాలలో చోటుచేసుకుంది. గొల్లపల్లి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన  సింగారపు రాయ మల్లమ్మ, రాజమల్లయ్య భార్యభర్తలు. కొడుకులు సరిగా చూసుకోకపోవడంతో అదే గ్రామానికి చెందిన కూతురు వద్ద ఆరు నెలలుగా ఉంటున్నారు. అయితే వృద్ధ దంపతులకు మంత్రాలు వస్తాయనే నెపంతో చుట్టుపక్కలవారు తరచూ గొడవ పడేవారు.

కొడుకు వద్ద ఉన్నప్పుడు కూడా ఇలాగే మంత్రాల నెపంతో తిడుతుండేవారని, కూతురి వద్ద ఉన్నా అలాగే తిట్టడంతో మనోవేదనకు గురై శుక్రవారం కోటిలింగాల గోదావరిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. నీటిలో మునిగిన దంపతులను రజక వ్యక్తి శంకరయ్య చూసి ఒడ్డుకు తీసుకువచ్చాడు. స్థానికులు, పోలీసులకు సమాచారం అందించాడు. ఎస్సై కిరణ్ కొడుకులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. మళ్లీ ఇలాగే కొనసాగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని వార్తల కోసం

వృద్ధ దంపతులతో మాట్లా డుతున్న పోలీసులు

 

Latest Updates