పెళ్ళైన యువతిని.. నన్ను పెళ్లి చేసుకో అంటూ టార్చర్

హైదరాబాద్: ఇష్టంలేదని చెప్పినా వినలేదు. వివాహితపట్ల ఓ యువకుడు క్రూరంగా ప్రవర్తించినందుకు చివరకు ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో జరిగింది.

వివరాలు: సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లాపూర్ కి చెందిన అజయ్ అనే యువకుడు.. మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజ్ లో పని చేస్తున్నాడు. అజయ్ కి కూకట్ పల్లికి చెందిన (తనకంటే పెద్దవయసున్న) ఓ మహిళతో పరిచయం ఉంది. అదే ఆసరాగా తీసుకున్న అజయ్ .. ఆ మహిళ కూతురిని తనకు ఇచ్చి పెళ్లి చేయాలని ఆమెను టార్చర్ పెట్టాడు. ఫ్లీజ్ ఆంటీ నీ కూతురిని నేను పెళ్లి చేసుకుంటాను అంటూ సంవత్సరంగా అడుగుతున్నప్పటికీ.. ఆమె ఒప్పుకోలేదు.

అయితే ఇటీవలే ఆమె కూతురు వేరే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలిసిన అజయ్.. మహిళ కూతురు, ఆమె భర్తకు ఫోన్ చేస్తూ వేధించాడు. అతడిని వదిలేసి నన్ను పెళ్లి చేసుకోవాలంటూ వివాహితను బెదిరించాడు. దీంతో విసుగు చెందిన ఆ ఫ్యామిలీ..శుక్రవారం ఉదయం అజయ్ ఇంటికి వెళ్లి అతనిపై దాడి చేశారు. అజయ్ కి బలమైన గాయాలు తగలడంతో గాంధీ హాస్పిటల్ కి తరలించారు. చికిత్స పొందుతూ అజయ్ చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Latest Updates