మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం

హైదరాబాద్ : ఓ మైనర్ బాలికకు ఓ యువకుడు ఫేస్ బుక్ లో హాయ్ అంటూ పరిచయం అయ్యాడు. వీరిద్దరి మధ్య స్నేహం పెరిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ప్రేమలోకి దించాడు. ఆ తర్వాత అమ్మాయితో కలిసి ఫొటోలు దిగాడు. ఆ ఫొటోలను బాలిక తండ్రికి చూపించి రూ.11లక్షలు వసూలు చేశాడు. ఫొటోలు అన్నీ డిలేట్ చేశానని నమ్మించిన ఆ యువకుడు మరింత డబ్బు కోసం ఆశపడ్డాడు. ఈ సారి ఏకంగా రూ 40 లక్షలు ఇస్తే ఫొటోలు డిలేట్ చేస్తానని.. లేదంటే బాలిక ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతానని బాలిక తండ్రిని బెదిరించాడు.

వాడి అసలు రంగు తెలుసుకున్న బాలిక తండ్రి..మంగళవారం సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేశాడు.   రాజమండ్రిలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వేధింపులకు పాల్పడిన ఆ యువకుడు రాజమండ్రికి చెందిన హేమంత్ సాయిగా గుర్తించారు. హేమంత్ కు సహకరించిన ఫ్రెండ్స్ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నాట్లు తెలిపారు పోలీసులు.

Latest Updates