IPLలో హర్భజన్ సింగ్ @ 150

ఐపీఎల్ లో  హర్భజన్ సింగ్ అరుదైన మైలు రాయి అందుకున్నాడు. ఈ మెగా టోర్నీలో 150 వికెట్లు తీసిన నాలుగో బౌలర్ గా నిలిచాడు. శుక్రవారం  ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో బ్యాట్స్ మన్ రూథర్ ఫర్డ్  వికెట్ తో భజ్జీ ఈ మార్కును దాటాడు. ఈ జాబితాలో మలింగ 169, అమిత్ మిశ్రా 157, అతనికంటే ముందున్నారు. పియూష్ చావ్లా ఖతాలోకూడా 150 వికెట్లు ఉన్నాయి.