వాట్సన్.. వాట్ ఎ డెడికేషన్..! రక్తం కారుతున్నా ఆడాడు

ఐపీఎల్ ఫైనల్ లో  ముంబైతో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్ మెన్ షేన్ వాట్సన్  ఇన్నింగ్స్ ను ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే 150 పరుగుల చెన్నై టార్గెట్ లో వాట్సన్ 80 పరుగులు చేసి కీలక ఇన్సింగ్స్ ఆడాడు. ఒక విధంగా  చెప్పాలంటే చెన్నై గెలుపు ఖాయం అనే స్థితికి తెచ్చాడు. అయితే వాట్సన్ బ్యాటింగ్ చేసేటప్పుడు అతడి లెఫ్ట్ లెగ్ మోకాలికి గాయం అయి రక్తం కారుతోంది.అయినా  అలాగే బ్యాటింగ్ చేశాడు వాట్సన్. అయితే ఈ విషయం ఎవరూ చెప్పలేదు. కానీ  గాయంతో రక్తమోడుతున్న వాట్సన్ ఫోటోను హర్బజన్ సింగ్ ట్విట్టర్ లో పోస్ట్ చేసి  ఈ విషయాన్ని చెప్పాడు. వాట్సన్  పోరాట పటిమ అద్భుతమని కొనియాడాడు. వాట్సన్ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు కానీ అతని గాయానికి ఆరు కుట్లు పడ్డాయని చెప్పాడు భజ్జీ.

 

 

 

Latest Updates