నా క్రికెట్​ కెరీర్​కు హర్భజన్‌‌‌‌ విరోధి

మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌: మెరుపు కీపింగ్‌‌‌‌తోనే కాకుండా పవర్‌‌‌‌ఫుల్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌తో ఎంతోమంది బౌలర్లకు సింహస్వప్నం అయిన ఆస్ట్రేలియా లెజెండ్‌‌‌‌ ఆడమ్‌‌‌‌ గిల్‌‌‌‌క్రిస్ట్‌‌‌‌ను ఇండియా వెటరన్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ హర్భజన్‌‌‌‌ సింగ్‌‌‌‌ దడ పుట్టించాడట. కెరీర్‌‌‌‌ అసాంతం గిల్లీకి మనోడు సవాల్‌‌‌‌ విసిరాడట. ఈ విషయాన్ని స్వయంగా గిల్లీనే చెబుతున్నాడు. తన క్రికెట్‌‌‌‌ కెరీర్‌‌‌‌కు భజ్జీ విరోధి అన్న గిల్‌‌‌‌క్రిస్ట్‌‌‌‌.. అతనితో పాటు శ్రీలంక స్పిన్‌‌‌‌ లెజెండ్‌‌‌‌ ముత్తయ్య మురళీధరన్‌‌‌‌ తాను ఎదుర్కొన్న క్లిష్టమైన బౌలర్లని చెప్పాడు. 2001లో ఇండియాలో జరిగిన టెస్ట్‌‌‌‌ సిరీస్‌‌‌‌లో ఆసీస్‌‌‌‌ను హర్భజన్‌‌‌‌ ఎలా దెబ్బకొట్టాడో గుర్తు చేసుకున్నాడు. ‘ఫస్ట్‌‌‌‌ టెస్టులో మా జట్టుకు 99/5తో ఉన్న దశలో నేను బ్యాటింగ్‌‌‌‌కు వచ్చా. 80 బాల్స్‌‌‌‌లోనే సెంచరీ కొట్టా.  మూడో రోజుల్లోనే  మేం మ్యాచ్‌‌‌‌ నెగ్గాం. ఇంత ఈజీగా గెలిచినప్పుడు.. ఇక్కడ సిరీస్‌‌‌‌ నెగ్గకుండా 30 ఏళ్లుగా మా వాళ్లు ఏం చేస్తున్నారు? అనుకున్నా. కానీ, నేనెంత తప్పుగా ఆలోచించానో సెకండ్‌‌‌‌ టెస్టులోనే తెలిసొచ్చింది. ఫస్ట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ తర్వాత మా పరిస్థితి  రివర్సైంది. సిరీస్‌‌‌‌ ముగిసే (ఇండియా 2–1తో గెలిచింది) సరికి.. ఇండియాలో గెలవాలంటే  ముందుగా నిలకడగా ఆడడం నేర్చుకోవాలని తెలిసింది. అంతేకాక ఎప్పుడూ అటాకింగ్‌‌‌‌ గేమ్‌‌‌‌ ఆడడం వర్కౌట్‌‌‌‌ కాదన్న విషయం అర్థమైంది. హర్భజన్‌‌‌‌ మమ్మల్ని అంతగా దెబ్బకొట్టాడు’ అని చెప్పుకొచ్చాడు.

Harbhajan Singh "Was A Bit Of A Nemesis For Me", Says Adam Gilchrist

Latest Updates