IPL 2019: 70 పరుగులకు కుప్పకూలిన RCB

ఐపీఎల్ మెగాటోర్నీలో 12వ సీజన్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తలపడ్డాయి. చెన్నైకి ధోనీ కెప్టెన్ గా వ్వవహరిస్తుండగా.. బెంగళూరుకు కోహ్లీ నాయకత్వం వహిస్తున్నారు. టాస్ గెలిచిన ధోనీ ఫీల్డింగ్ ఎంచుకోగా.. బెంగళూరు బ్యాటింగ్ కు దిగింది. అయితే చెన్నై బౌలర్ హర్భజన్ ధాటికి.. కోహ్లీ టీం టాప్ ఆర్డర్  కుప్పకూలింది. 17.1 ఓవర్లలో 70 పరుగులకు బెంగళూరు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో హర్భజన్, తాహిర్  చెరో మూడు వికెట్లు తీయగా, జడేజా రెండు వికెట్లు పడగొట్టారు. బెంగళూరు బ్యాట్స్‌మెన్స్‌లో పార్థివ్ పటేల్ 29 పరుగులు చేశాడు.

తొలిసారి ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ప్రారంభమైంది ఐపీఎల్ టోర్నీ. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు సంతాపంగా వేడుకలను రద్దు చేసింది కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. దీంతో ఇండియన్ ఆర్మీ బ్యాండ్ ప్రదర్శనలతో టోర్నీని స్టార్ట్ చేశారు.

Latest Updates