మోడీపై అసభ్యకర కామెంట్స్… ఆమెను ట్విట్టర్ తొలగించింది

hard-kaur-abused-pm-modi-and-amit-shah-on-twitter

పంజాబీ ర్యాపర్  హర్ద్ కౌర్ ట్విటర్ వేధికగా ప్రధాని నరేంద్ర మోడీపై, కేంద్ర మంత్రి అమిత్ షాపై పాటరూపంలో అసభ్యకర పదజాలంతో దూషించింది. దేశం నుంచి వేరుపడాలనుకుంటున్న ఖలిస్తాన్ మద్దతుదారులతో కలిసి ఓ పాటను రూపొందించిన హర్ద్ కౌర్…. మోడీ, అమిత్ షాల కు సవాలు విసురుతూ… వారిపై అసభ్యకరంగా కామెంట్స్ చేసింది. ఇందుకు స్పంధించిన ట్విటర్… హర్ద్ కౌర్ ట్విటర్ అకౌంట్ ను బ్యాన్ చేసింది.

హర్ద్ కౌర్ ఇదివరకే ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆధిత్య నాథ్ పైన కూడా కామెంట్స్ చేసింది. యోగిని రేప్ మెన్ అని పిలవాలని సోషల్ మీడియాలో కామెంట్ చేసింది. దీంతో పాటు RSS చీఫ్ భగవత్ ను ఉగ్రవాదిగా పేర్కొంది. ఇందుకు గాను హర్ద్ కౌర్ పై దేశద్రోహంతో పాటు పలు కేసులు నమోదయ్యాయి.

Latest Updates