నా కొడుకు నిశ్చితార్థం గురించి మాకు తెలియదు

ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంగేజ్‌మెంట్ గురించి తమ కుటుంబానికి ఎటువంటి సమాచారం లేదని ఆయన తండ్రి హిమాన్షు అన్నారు. ఇండియన్ క్రికెట్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, నటి నటాసా స్టాంకోవిక్‌‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు న్యూఇయర్ రోజు ప్రకటించాడు. ఆ వార్త అతని అభిమానులతో పాటూ.. అతని కుటుంబానికి కూడా ఆశ్చర్యం కలిగించింది. హార్దిక్ ఇటీవల నటి నటాసా స్టాంకోవిచ్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి, కానీ ఆ విషయం గురించి తమ కుటుంబానికి ఎటువంటి ఆధారాలు లేవని హిమాన్షు అన్నారు. ‘నటాసా చాలా మంచి అమ్మాయి, మేము ఆమెను ముంబైలో చాలా సందర్భాలలో కలుసుకున్నాము. నటాసా, హార్థిక్ దుబాయ్ టూర్‌కి వెళ్లారని మాత్రమే మాకు తెలుసు, కానీ వారు నిశ్చితార్థం చేసుకున్నారనే దానిపై మాకు ఎటువంటి ఆధారాలు లేవు. ఇది మాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. వారి నిశ్చితార్థం గురించి మేం వార్తల ద్వారానే తెలుసుకున్నాము’ అని హార్దిక్ తండ్రి హిమాన్షు అన్నారు.

న్యూఇయర్ సందర్భంగా.. జనవరి 1 న, నటాసాకు ప్రపోజ్ చేస్తున్న ఓ ఫొటోను హార్థిక్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నాడు. ఆ ఫొటోకు ‘మై తేరా, తు మేరీ జానే, సారా హిందుస్తాన్’అనే క్యాప్షన్ పెట్టాడు.

కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ విషయంపై స్పందిస్తూ… ఇది ఎంతో ఆనందకరమైన మరియు ఆశ్చర్యకరమైన విషయం. మీరు మీ జీవితాన్ని చాలా గొప్పగా గడపాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానని అన్నాడు.

ప్రస్తుతం హార్దిక్.. వెన్నెముక గాయంతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. త్వరలో శ్రీలంక మరియు ఆస్ట్రేలియాలతో ఇండియాలో జరిగే టి20 మరియు వన్డే సిరీస్‌లలో పాల్గొననున్నాడు.

Latest Updates