హార్దిక్ పాండ్యా ఫుల్ ఫిట్.. ఆఫ్ఘన్తో వన్డే సిరీస్ కి లైన్ క్లియర్

హార్దిక్ పాండ్యా ఫుల్ ఫిట్.. ఆఫ్ఘన్తో వన్డే సిరీస్ కి లైన్ క్లియర్

Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఫుల్ ఫిట్‌నెస్ సాధించాడు. వచ్చే శనివారం నుంచి ధర్మశాల వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆడటానికి బీసీసీఐ (BCCI) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్పోర్ట్స్ సైన్స్ టీమ్ మనోడికి క్లియరెన్స్ ఇచ్చేసింది. మొన్నటి ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నప్పుడు నడుము నొప్పితో (Back Spasms) కొన్ని మ్యాచ్‌లకు దూరమైన పాండ్యా.. జూన్ 2 నుంచి బెంగళూరులోని సీఓఈ (CoE) లోనే ఉండి ఫిట్‌నెస్ టెస్టులు పాసయ్యాడు.

నెట్స్‌లో 10 ఓవర్ల బౌలింగ్: 
బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం హార్దిక్ పాండ్యా సీఓఈలో చేరడానికి ముందు విదేశాల్లో హాలిడే ఎంజాయ్ చేశాడు. జూన్ 2న బెంగళూరు వచ్చాక గత ఐదు రోజులుగా వరుసగా ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాడు. అంతేకాదు, నెట్స్‌లో ఏకంగా తన పూర్తి కోటా అయిన 10 ఓవర్ల పాటు బౌలింగ్ కూడా చేసి దుమ్ములేపాడు. బౌలింగ్ చేస్తున్నప్పుడు అతడికి ఎలాంటి నొప్పి కలగలేదు. దీంతో అక్కడి స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌లు పాండ్యా ఫిట్‌నెస్ పారామీటర్స్ అన్నింటికీ ఓకే చెప్పేశారు.

టీమిండియా వన్డే టీమ్‌కు పెద్ద ప్లస్: 
వన్డే ఫార్మాట్‌లో హార్దిక్ పాండ్యా ఎంత కీలకమైన ప్లేయరో మనకు తెలిసిందే. మిడిల్ ఓవర్లలో పేస్ బౌలింగ్‌తో వికెట్లు తీయడం, డెత్ ఓవర్లలో బ్యాట్‌తో సిక్సర్లు కొట్టడంతో పాటు మ్యాచ్‌లను ముగించడంలో మనోడు తోపు.. అతను జట్టులో ఉంటే వచ్చే బ్యాలెన్సే వేరు, ఇప్పుడు ప్రాక్టీస్‌లోనే ఏకంగా 10 ఓవర్లు వేస్తున్నాడంటే.. 50 ఓవర్ల క్రికెట్ ఆడేందుకు అతడి బాడీ పక్కాగా సెట్ అయిందని అర్థం. అయితే పాండ్యా నేరుగా ధర్మశాల వెళ్తాడా లేక చండీగఢ్‌లో టీమ్‌తో కలిసి నైట్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంటాడా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

బెంగళూరులోనే రోహిత్ శర్మ: 
మరోవైపు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ప్రస్తుతం బెంగళూరులోని సీఓఈ లోనే ఉన్నాడు. ఐపీఎల్ టైమ్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నప్పుడు రోహిత్‌కు తొడకండరాల గాయం (Hamstring Niggle) అయింది. ఆ ఇంజ్యూరీ తీవ్రత ఎంత ఉందో తెలుసుకోవడానికి, ఫిట్‌నెస్ అసెస్‌మెంట్ కోసమే రోహిత్ కూడా అక్కడికి చేరాడు.