యోయో పాసైతేనే ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ లు

వెన్ను నొప్పికి ఆపరేషన్‌‌ తర్వాత టీమిండియా ఆల్‌ రౌండర్‌‌ హార్దిక్‌ పాండ్యా ..ఇంకా మ్యాచ్‌ ఫిట్‌ నెస్‌ ను సాధించలేదని బీసీసీఐ ప్రెసిడెంట్‌ సౌరవ్‌ గంగూలీ వెల్లడించాడు. ‘పాండ్యా ఇప్పటికిప్పుడు మ్యాచ్‌ ఆడలేడు. ఫిట్‌ నెస్‌ సాధించడానికి మరికొంత సమయం పడుతుంది. అతను యోయో టెస్ట్‌‌ పాసైతేనే ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ లు ఆడొచ్చు’ అని దాదా చెప్పాడు. ఇక స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే మూడుమ్యాచ్‌ ల వన్డే సిరీస్‌ కు టీమిండియాను కొత్త సెలెక్షన్‌‌ కమిటీ ఎంపిక చేస్తుందని తెలిపాడు. వీలైనంత త్వరగా కొత్త కమిటీ కోసం ఇంటర్వ్యూలను నిర్వహిస్తామన్నాడు. ఎమ్మెస్కే ప్రసాద్‌‌ (సౌత్‌ జోన్‌‌), గగన్‌‌ ఖోడా (సెంట్రల్‌ జోన్‌‌) స్థానాల కోసం… లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌‌, అజిత్‌ అగార్కర్‌‌, రాజేశ్‌ చౌహన్‌‌, వెంకటేశ్‌ ప్రసాద్‌‌ పోటీపడుతున్నసంగతి తెలిసిందే. సెలెక్షన్‌‌ కమిటీని ఎంపిక చేసే క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ (సీఏసీ)లో గౌతమ్‌ గంభీర్‌‌ స్థా నంలో కొత్త వారిని తీసుకుంటామన్నాడు. పార్లమెంట్‌ మెంబర్‌‌గా ఉంటూ బీసీసీఐలో పదవులు చేపట్టే చాన్స్‌ గౌతీకి లేదన్నాడు. మాజీ క్రికెటర్లు మదన్‌‌ లాల్‌ , సులక్షణ నాయక్‌ మాత్రం కొనసాగుతారని చెప్పా డు.

Latest Updates