పాండ్యా చితక్కొట్టుడు… 55 బాల్స్‌లో 158 రన్స్‌

ఐపీఎల్‌‌–2020లో తన ఆట ఎలా ఉండబోతుందో.. ఆల్‌‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా (55బాల్స్‌ లో 6 ఫోర్లు, 20 సిక్సర్లతో 158 నాటౌట్‌ )వరుస పెట్టి టీజర్లు చూపెడుతున్నాడు. మొన్న కాగ్‌జట్టుపై (39 బంతుల్లో 105 రన్స్‌ ) కొట్టి న సెంచరీని మరువకముందే.. డీవై పాటిల్ టీ20 టోర్నీలో దానిని మించిన విధ్వంసాన్ని సృష్టించాడు. జస్ట్‌‌ 55బంతుల్లో 20 సిక్సర్లతో పరుగుల సునామీ సృష్టించాడు. దీంతో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో రిలయన్స్‌వన్‌‌ టీమ్‌ 104 రన్స్‌ తేడాతో బీపీసీఎల్‌‌పై విజయంసాధించింది. ముందు గా బ్యాటింగ్‌ కు దిగిన రిలయన్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 238 రన్స్‌ చేసింది.10/2 స్కోరుతో కష్టాల్లో పడ్డ రిలయన్స్‌ టీమ్‌ కు పాండ్యా ఒంటి చేత్తో భారీ స్కోరును అందించాడు.అద్భుతమైన టైమింగ్‌ , అంతకు మించిన టెక్నిక్‌ తో బీపీసీఎల్‌‌ బౌలర్లను ఉతికి ఆరేశాడు. దూబే వేసిన18వ ఓవర్‌ లో పాండ్యా కవర్స్‌ లో కొట్టిన టవరింగ్‌ సిక్స్‌ మ్యాచ్‌ కే హైలెట్‌ . గాయం నుంచి కోలుకుంటున్న శిఖర్‌ ధవన్‌‌ (3) మరోసారి నిరాశపర్చినా..పాండ్యా కొట్టిన కొట్టుడుకు రిలయన్స్‌ భారీ స్కోరు చేసింది. తర్వాత బ్యాటింగ్‌ కు దిగిన బీపీసీఎల్‌‌ 134రన్స్‌ కు కుప్పకూలింది. బౌలింగ్‌ లోనూ ఓ ఓవర్‌వేసిన పాండ్యా ఆరు రన్స్‌ ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు.మొత్తానికి వెన్ను నొప్పి ఆపరేషన్‌‌తో వచ్చిన లాంగ్‌ బ్రేక్‌ తర్వాత ఆట మొదలుపెట్టి న పాండ్యా .. ఎప్పుడెప్పుడు టీమిండియాలోకి వచ్చేద్దామా? అన్న కసితో కనిపిస్తున్నాడు.

ధవన్‌ దంచాడు..

సెమీస్‌ వరకు వీరవిహారం చేసిన పాండ్యా .. ఫైనల్లోమాత్రం చతికిలపడ్డాడు. అయితే శిఖర్‌ ధవన్‌‌ (41బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 69) చెలరేగినా..టైటిల్‌‌ పోరులో రిలయన్స్‌ వన్‌‌ టీమ్‌ 11 రన్స్‌ తేడాతో ఇండియన్‌‌ ఆయిల్‌‌ చేతిలో ఓడింది. ముందుగా ఇండియన్‌‌ ఆయిల్‌‌ టీమ్‌ 194/5 స్కోరు చేసింది.ఆదిత్య తారే (75 నాటౌట్‌ ) రాణించాడు. తర్వాత రిలయన్స్‌ 183/7 స్కోరుకే పరిమితమైంది.

Latest Updates