పాండ్య, రాహుల్ కు చెరో రూ.20లక్షల జరిమానా

మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ లకు బీసీసీఐ అంబుడ్స్ మన్  డీకే జైన్ జరిమానా విధించింది.  ఇద్దరు చెరో రూ. 20 లక్షల ఫైన్  చెల్లించాలంటూ  ఆదేశాలు జారీ చేసింది. అమరులైన  పారామిలటరీ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులకు చెరో రూ. 10 లక్షలు, అంధుల క్రికెట్ అసోసియేషన్ కు  చెరో రూ.10 లక్షలు విరాళం ఇవ్వాలని ఆదేశించింది. నాలుగు వారాల్లోగా ఈ జరిమానా చెల్లించాలని..లేకపోతే మ్యాచ్ ల ఫీజులో  కట్ చేసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.  కొన్ని రోజుల క్రితం హిందీలో కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా ఉన్న ‘ కాఫీ విత్ కరణ్‘ అనే షోలో పాల్గొన్న పాండ్య, రాహుల్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో వీరిపై కొన్ని రోజులు నిషేదం విధించింది బీసీసీఐ.

Latest Updates