దుబ్బాకలో కల్యాణ లక్ష్మీ చెక్కులు అందజేసిన హరీష్

తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కడా తాగునీటి సమస్య రాలేదన్నారు ఆర్థికమంత్రి హరీష్ రావు. దుబ్బాక నియోజకవర్గంలో 315 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు అందించారు.14 మందికి CMRF చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 57 వేల మందికి ఫించను ఇస్తున్నామన్నారు. TRS హయాంలో సర్కార్ దవాఖాన్ల సౌకర్యాలు పెంచామని చెప్పారు. ఇప్పటివరకు ఏడు లక్షల మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ కింద 5 వేల 555 కోట్లు పంపిణీ చేశామన్నారు.

Latest Updates