కేసీఆర్ ఆదేశాలు పాటిస్తా.. పార్టీకోసం సైనికుడిలా పనిచేస్తా : హరీష్ రావు

తెలంగాణ మంత్రివర్గంలో తనకు చోటు దక్కకపోవడంపై సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా చెడు ప్రచారమే అని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మంత్రుల ప్రమాణ స్వీకారానికి రాజ్ భవన్ కు హాజరైన హరీష్ రావు.. ప్రమాణ స్వీకారం తర్వాత వెళ్లిపోయారు. రాజ్ భవన్ బయట మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన కొద్దిసేపు జవాబిచ్చారు. కొత్తమంత్రులకు హృదయ పూర్వకంగా శుభాకాంక్షలు చెబుతున్నా అన్నారు. సీఎం నిర్దేశించిన లక్ష్యాలు సాధించేందుకు… ప్రజల ఆకాంక్షలు నిజం చేయడం కోసం కొత్తగా పదవి స్వీకారం చేసిన మంత్రులు కృషి చేయాలని ఆకాంక్షించారు.

“నేను టీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన సైనికుడి లాంటి కార్యకర్తను. సీఎం ఏది ఆదేశఇస్తే.. తు.చ. తప్పకుండా పాటిస్తా. సీఎం.. తెలంగాణలోని ఆయా ప్రాంతాలు, అన్ని వర్గాల బాగుకోసం కేబినెట్ ఏర్పాటు చేశారు. ఏ బాధ్యత ఇచ్చినా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పాటిస్తా. కేబినెట్ లో నాగురించి సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్చచారాన్ని ఖండిస్తున్నా. ఎవరూ కూడా అలాంటి ప్రచారాలు చేయొద్దు.  ఎవరూ కూడా వాటిని సీరియస్ గా తీసుకోవద్దు. అందరూ సమష్టిగా పార్టీకోసం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని కోరుతున్నా” అన్నారు హరీష్ రావు.

Latest Updates