ఆ మీడియా సంస్థ సారీ చెప్పాల్సిందే: హరీష్

తాను పార్టీ మారబోతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు. హరీష్ రావు  బీజేపీలో చేరబోతున్నారని  ఇవాళ ఓ ఇంగ్లీష్  న్యూస్ పేపర్ స్టోరీ రాసింది. అయితే ఈ వార్త ఏప్రిల్ 1 సందర్భంగా ఏప్రిల్ ఫూల్..ఇది ఫేక్ న్యూస్ అంటూ పేర్కొంది. ఇది కాస్త వైరల్ గా మారడంతో దీనిపై స్పందించిన హరీష్ ఆ పేపర్ తీరుపై ట్విట్టర్ వేదికగా సీరియస్ అయ్యారు. తనపై ఫేక్ న్యూస్ ప్రదర్శించిన మీడియా సంస్థ రేపటిలోగా అదే పేజీలో క్షమాపణ చెబుతూ మరో న్యూస్ రాయాలని డిమాండ్ చేశారు. తప్పుడు వార్తలపై పోరాడుతున్న సమయంలో ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారని అన్నారు. ఫేక్ న్యూస్ ను ప్రచురించవద్దని మీడియా సంస్థలను కోరారు.

Latest Updates