మన తలసరి ఆదాయం రూ. 93,166 ఎక్కువ

ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. 2020-21 ఆర్థిక సంవత్సరం లో మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో 2,384 కోట్లు తగ్గాయన్నారు.  2019-20 బడ్జెట్ లో అంచనాల మేరకు మార్చ్ నెలాఖరు వరకు 1, 36 000 కోట్లు ఖర్చు జరుగుతుందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కంటే ఎక్కువన్నారు. 2019-20 నాటికి తెలంగాణ తలసరి ఆదాయం రూ. 2,28,216 ఉండగా…దేశ తలసరి ఆదాయం రూ. 1,35,050 ఉందన్నారు . దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం రూ. 93,166 ఎక్కువన్నారు.

Latest Updates