కారుకు ఓటేసి సేవ చేసే భాగ్యం కల్పించండి

మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు  ఓటేస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి హరీశ్ రావు. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రోడ్ షో నిర్వహించిన ఆయన .. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం వెయ్యి రూపాయల పెన్షన్ రెండు వేలకు పెంచామన్నారు. దుబ్బాకకు రూ. 35 కోట్ల రూపాయలు ఇచ్చి ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తయారు చేసిన ఘనత  కెసిఆర్ దన్నారు. రైతు బందు పథకం కోసం ఏడాదికి రూ. 12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.  మరి కొన్ని రోజుల్లో  కాళేశ్వరం  ద్వారా దుబ్బాక, దర్మాజిపేట చెరువు కుంటలు నింపుతామన్నారు. దయ చేసి కారు గుర్తుకు ఓటేసి సేవ చేసే భాగ్యం కల్పించాలన్నారు.

Latest Updates