హరీశ్ రావుకే దిక్కులేదు..నాకు పదవేం ఇస్తడు

రామచంద్రాపురం, వెలుగు: ‘టీఆర్ఎస్ నేత హరీశ్​రావుకే పార్టీలో దిక్కులేదు.. ఆయన నాకేం నామినేటెడ్ పదవి ఇస్తడు’ అని కాంగ్రెస్ మెదక్ పార్లమెంటు అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మండిపడ్డారు. టీఆర్ఎస్ తో ములాఖతై తాను ప్రచారం చేయట్లేదని, నామినేటెడ్ పదవికి లొంగిపోయానని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గురువారం రామచంద్రాపురంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు టీఆర్ఎస్ నేత హరీశ్ రావు నామినేటెడ్ పదవి ఇస్తానని హామీ ఇచ్చారని, అందుకే ప్రచారంలో వెనకడుగు వేస్తున్నాననే వార్తల్లో వాస్తవంలేదన్నారు. రెండు ప్రధాన చానళ్లలో బ్రేకింగ్ న్యూస్ గా

వాటిని మార్ఫింగ్ చేశారని, ఆ చానళ్ల యాజమాన్యాలను అడిగితే అలాంటివి ప్రసారం చేయలేదని అన్నారని తెలిపారు. టీఆర్ఎస్ నేతల మైండ్ గేమ్ అందరికీ అర్థం అవుతోందని, ఈవీఎంలనే ట్యాపరింగ్ చేసి గెలిచేవాళ్లకు ఇలాంటి వో లెక్కా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి బీజేపీ నాయకులు కూడా తోడై చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, ఎన్ని కుట్రలు పన్నినా తన విజయాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. తాను ఎంపీగా గెలిచిన తర్వాత హరీశ్​రా వుకే ఒక పోస్ట్ ఇప్పి స్తానన్నారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డి దత్తత తీసుకున్న లక్డారం గ్రామంలో కనీస సౌకర్యాలు కల్పించలేదని, అలాంటి వ్యక్తికి ప్రజలు ఓట్లు వేయరని పేర్కొన్నారు. ఈ వైరల్ న్యూస్ నర్సాపూర్ కి చెందిన రామ చందర్ రెడ్డి అనే వ్యక్తి సర్య్ కులేట్​చేసినట్లుగా తేలిందన్నారు. ఈ పని చేసినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిం దిగా పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Latest Updates