సొంత జాగా ఉంటే ఇల్లు కట్టుకునేందుకు పైసలిస్తం

  • లక్ష మందికి మంజూరు చేస్తం : మంత్రి హరీశ్
  • దీనిపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ఆమోదం తీసుకున్నామని వెల్లడి 
  • దుబ్బాకలో శంకుస్థా పనలు,ప్రారంభోత్సవాలు

దుబ్బాక, వెలుగు:  పాత గూనపెంకల ఇండ్లలో ఉంటున్నవాళ్లు, జాగా ఉండి ఇల్లు కట్టుకోలేని స్థితిలో పేదలకు.. వారి స్థలంలో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టుకునేందుకు డబ్బులు ఇస్తామని మంత్రి హరీశ్​ రావు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలా సొంత జాగాల్లో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించుకోవడానికి సాయం చేస్తామని తెలిపారు. దీనిపై గత బడ్జెట్ సమావేశాల్లో తానే బిల్లు పెట్టి ఆమోదం తీసుకున్నానని వెల్లడించారు. త్వరలో బై ఎలక్షన్​ జరుగనున్న దుబ్బాక మున్సిపాలిటీలో హరీశ్​రావు సోమవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దుబ్బాకలో 3 వేల డబుల్‌‌‌‌ ‌‌‌‌బెడ్రూం ఇండ్లు నిర్మిస్తున్నామని.. ఇండ్లు, స్థలాలు లేని వారికే వాటిని కేటాయిస్తామని చెప్పారు. అదనంగా వెయ్యి ఇండ్లను మంజూరు చేసేలా సీఎం కేసీఆర్ నుంచి అనుమతి తీసుకుంటానన్నారు. సొంత జాగా ఉన్న పేదలకు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేస్తామని.. కరోనా వల్ల కాస్త ఆలస్యమైందని, పరిస్థితి కుదుటపడగానే మంజూరు చేస్తామని తెలిపారు. దుబ్బాక మున్సిపాలిటీలో వివిధ  డెవలప్​మెంట్​పనుల కోసం రెండు రోజుల్లో రూ.2 కోట్లను మంజూరు చేస్తామని ప్రకటించారు.

కేసీఆర్​ ఎవరికిస్తే వారికే..

దుబ్బాక ఉప ఎన్నికల్లో  టీఆర్ఎస్​ టికెట్​ను రామలింగారెడ్డి సతీమణి సుజాతకు ఇవ్వడమా? మరెవరికైనా కేటాయించడమా అన్న విషయంలో తుది నిర్ణయం సీఎం కేసీఆర్ దేనని హరీశ్​ చెప్పారు.

Latest Updates