ఈ సారి సిద్దిపేటకు నెంబర్ వన్ అవార్డు రావాలి

సిద్ధిపేట కీర్తి దేశం నలుమూలల వ్యాపించేలా చేయాలన్నారు మంత్రి హరీశ్ రావు. పట్టణ ప్రజలు సిద్దిపేటను స్వచ్ఛ సిద్దిపేటగా మార్చడానికి భాగస్వామ్యం కావాలన్నారు.  మహానగరాలకు ధీటుగా సిద్దిపేట పట్టణ అభివృద్ధి జరుగుతుందన్నారు. భారత ప్రభుత్వము చెత్తరహిత పట్టణాలు, క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండే పట్టణాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ఇస్తుందని..ఈ ఏడాది సిద్దిపేటకు నెంబర్ వన్ అవార్డు రావాలన్నారు.

పతంగుల పండుగను ప్రజల మధ్య ఐక్యతను ప్రజల్లో అవగాహన పెంచడానికి స్వచ్ఛ పతంగుల పండుగ నిర్వహిస్తున్నామన్నారు. సిద్దిపేట కీర్తి కూడా పతంగుల లాగా దేశం మొత్తం కనపడేలా ఎగరాలన్నారు. అందరూ అనుకుంటే సిద్దిపేట కీర్తిని దేశం నలుమూలల వినిపించేలా చేద్దామన్నారు. సిద్దిపేటలో ఇప్పటికే బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలుగా మార్చుకున్నామన్నారు. సిద్ధిపేట మున్సిపాలిటీ గురించి 1969కి ఫోన్ చేసి పాజిటివ్ పిడ్ బ్యాక్ ఇవ్వాలన్నారు.

see more news

జల్లికట్టు పోటీలకు హాజరైన రాహుల్, ఉదయనిధి

ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని చెప్పి బైక్ కొట్టేసిన్రు

రాజకీయ పార్టీలకు ‘‘సాగర్’’ సవాల్ ​

సీజ్ చేసిన పైసల్ని వడ్డీతో కలిపి కట్టండి

Latest Updates