అడవిలో డ్రోన్‌ ద్వారా విత్తనాలు చల్లే కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

  • సిద్ధిపేట జిల్లా అడవుల్లో పచ్చదనం పెంచేందుకు
  • ముఖ్య అతిథిగా పాల్గొన్న వనజీవి రామయ్య

సిద్ధిపేట: సిద్ధిపేట జిల్లా అడవుల్లో పచ్చదనం పెంచేందుకు మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డ్రోన్‌ ద్వారా విత్తనాలు చల్లే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రకృతికి సేవ చేస్తే మనుషులకు సేవ చేసినట్టే అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మొక్కలను పెంచి పర్యావరణాన్ని కాపాడితే మంచి గాలి వస్తుందని, ఇప్పటికే ఢీల్లీ లాంటి ప్రాంతాల్లో ఆక్సిజన్ లేక కొనుక్కునే పరిస్థితి వచ్చిందని చెప్పారు.- ఒక్కరోజు మనిషి పీల్చే గాలి 3 ఆక్సిజన్ సిలిండర్లు, ఒక్కో సిలిండర్ ఖర్చు 700 రూపాయలు, ఈ లెక్కన మూడు సిలిండర్లకు 2100 ఖర్చు అవుతుందని ఈ లెక్కన ఒక మనిషి జీవిత కాలంలో పీల్చే ఆక్సిజన్ కొనుగోలు చేస్తే.. 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని హరీశ్‌ రావు అన్నారు.- చెట్లు ఉచితంగా ఆక్సిజన్ ఇస్తున్నాయని, చెట్లను పెంచాలని చెప్పారు. అడవుల్లో మనుషులు వెళ్ల లేని చోట ఉన్న ఖాళీ ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకే డ్రోన్ వినియోగిస్తున్నామని చెప్పారు.- కోతులకు ఆహారం ఇచ్చే చెట్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.- తెలంగాణ ప్రభుత్వం పచ్చదనం పెంపు కోసం అధిక ప్రాధాన్యం ఇస్తోందని,- గత ప్రభుత్వాలు అడవుల్లో చెట్లు నరికితే.. తెరాస ప్రభుత్వం అడవుల్లో మొక్కలు నాటి చెట్లు పెంచుతోందని చెప్పారు. – వనజీవి రామయ్య జీవితం అందరికి ఆదర్శం అని, వారు కోటికి పైగా మొక్కలు నాటారని కొనియాడారు.- అడవుల్లో పచ్చదనం పెంచడానికి సీడ్ బాల్స్ మంచి ప్రయత్నం అని వనజీవి రామయ్య అన్నారు. – సహజంగా మొలకెత్తిన మొక్క బలంగా పెరుగుతుందని, -చెట్టు కన్నతల్లి లాంటిందని అన్నారు.- లాటరీ టికెట్ కొంటే లాభం వస్తదో రాదో తెలియదు.. కానీ మొక్క నాటితే పండ్లు, నీడ, గాలి ద్వారా లాభం వస్తుందని చెప్పారు. నీటిలో చేప ఉన్నట్టుగా.. భూమిలో పండ్లు ఉంటాయని, చేపను బయటికి తీయడానికి గాలం వేసినట్టు.. భూమిలోని పండ్లను బయటికి తీయడానికి మొక్క నాటలి అని చెప్పారు. ప్రతి రోజు 50వేల హెక్టర్ల విస్తీర్ణంలో అడవి అంతరించిపోతుందని, శాశ్వత ప్రాతిపదికన మనం బతకాలంటే.. మొక్కలు నాటి వృక్షాలుగా చేయాలి అని చెప్పారు.

Latest Updates